శ్రీమహావిష్ణువు అవతారమూర్తి. దుష్టశిక్షణ....శిష్ట రక్షణ కోసం ఆయన దాల్చిన అవతారాలు అనన్యం. ఆ దుష్టశిక్షణ కోసమే ఆయన రూపుదాల్చిన స్వరూపం నరసింహ స్వామి. హిరణ్యకశిపుని సంహారం కోసం నరసింహుడు అవతారం దాల్చిన ప్రదేశం అహోబిలం. నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఈ క్షేత్రాన మహిమలను చాటుతున్నారు.
కర్నూలు. ఈ కర్నూలు సిగలోని ప్రముఖ వైష్ణవ ప్రదేశం అహోబిలం. దేశంలోని నరసింహ క్షేత్రాల్లో ప్రత్యేకమైనదిగా అహోబిల క్షేత్రాన్ని పేర్కొంటారు. ఎగువ అహోబిలంలో నరసింహ స్వామి ఉగ్రనరసింహుడుగా, దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడుగా కొలువై ఉన్నారు. దీనితో పాటు ఈ ఆలయ పరిసరాల్లో స్వామి మొత్తం 9రూపాల్లో కొలువై ఉన్నారు. జ్వాలా, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన, కారంజ, క్రోడ, మాలోల, ప్రహ్లాద వరద నరసింహ స్వామిగా ఇక్కడ స్వామి దర్శనమిస్తారు.
అవతరించిన ప్రదేశం ఇదే
హరినామమే కడు ఆనందకరమూ అని ప్రతి నిత్యం శ్రీమహావిష్ణువు ధ్యానంలో గడిపే బాల భక్తుడు ప్రహ్లాదుడు. శాప ప్రభావం వల్ల రాక్షసునిగా జన్మించిన హిరణ్యకశిపుడు అనే రాజు కుమారుడే ఈ ప్రహ్లాదుడు. హరిజపం తప్ప మరో వ్యాపకం లేకుండా గడుపుతుంటాడు ఆ బాలుడు. అయితే పరమ హరి ద్వేషి అయిన హిరణ్యకశిపునికి ఇది ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదట. అనేక సార్లు నచ్చజెప్పి చూసినా విష్ణుభజన మానకపోవడంతో కుమారుడు అన్న మమకారాన్ని సైతం మరిచి చంపేందుకు సిద్ధం అవుతాడు. చాలా సార్లు కొడుకును హతమార్చేందుకు యత్నించినా మహావిష్ణువు దయ వల్ల బయటపడతాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని షయంలో హిరణ్యకశిపుని ఆగడాలు శృతిమించుతూ ఉండడంతో మహావిష్ణువు సింహం తల, మనిషి శరీరం దాల్చి నరసింహుడుగా అవతరించి ఆ రూపంలోనే హిరణ్యకశిపున్ని సంహరిస్తాడు. విష్ణువు నరసింహుడుగా మారింది అహోబిల క్షేత్రంలోనే అని అంటారు. నరసింహుడు బయల్పడిన స్తంభం కూడా ఈ ప్రదేశంలో కనిపిస్తుంది. దీన్ని ఉగ్రస్తంభంగా పేర్కొంటారు. ఈ ప్రాంతాన్నే ఎగువ అహోబిలం అని అంటారు.
నవనారసింహుడిగా ఒకే చోట కొలువైన అహోబిల క్షేత్రం దేశంలోని నరసింహ క్షేత్రాల్లోనే అత్యంత పవిత్రమైనదిగా ప్రతీతి. నరసింహుడు జనించిన ఈ ప్రాంతం మహిమలను చూపడంలోనూ అంతే రీతిగా ప్రసిద్ధి చెందింది. వివిధ సమస్యలతో ఈ సన్నిధికి వచ్చిన వారికి ఇక్కడి స్వామి అంతులేని మానసిక ప్రశాంతతను సిద్ధిస్తాడట.
పంచ ప్రదిక్షణలతో ప్రశాంతత
అహోబిల నరసింహ స్వామి లీలా శేషాల్లో ప్రధానమైనది మానసిక గందరగోళాన్ని దూరం చేయడంలో ఈయన చూపే మహిమలు. సమస్యలతో మనసు కలమైన వారు అహోబిల క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ 5 ప్రదక్షిణలు నిర్వహిస్తే చాలా చక్కని ఫలితాలు ఉంటాయట.
నరసింహుడు ఎక్కడ కొలువై ఉన్నా ఆయన లీలలకు లోటుందట. అలాంటి ఆ స్వామి తాను అవతరించిన ప్రదేశమైన అహోబిలంలో అంతకు మించిన రీతిలో భక్తులను దీవిస్తున్నాడు. మహాశక్తివంత దైవ స్వరూపంగా పేరున్న ఈ స్వామి మీద భారం వేస్తే బాధాపీడితులకు ఏదో రూపంలో దారి చూపుతాడని పేరు. మహామహిమాకరుడైన నరసింహ స్వామి నవనారసింహుడుగా కొలువైన అహోబిల క్షేత్రం ప్రతి నిత్యం హరినామ ఘోషలతో అలరారుతూ ఉంటుంది. వైష్ణవ పూజా ధానంలో అత్యంత ప్రశస్తమైనదిగా చెప్పే పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అహోబిలంలో నిత్యపూజలు జరుగుతాయి.
అహోబిల నరసింహ స్వామికి ఉదయం సుప్రభాత సేవతో నిత్య కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ పిదప వరుసగా బాలభోగం, తలిగ ఆరాధన, తోమాల సేవ, పానకారాధన వంటి ఉంటాయి. రాత్రి ఉత్సవమూర్తికి శయనం చేసి పాలు, క్షీరాన్నం ఆరగింపు ఇస్తారు. దీంతో నిత్యపూజలు పరిసమాప్తం అవుతాయి.
నిత్యపూజలతో పాటు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వర్షోత్సవాలు వంటి నిర్వహిస్తారు. దీనితో పాటు ఫాల్గుణ శుక్ల చతి నుంచి పౌర్ణమి వరకు స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. వివిధ రూపాలు ధరించిన ప్రహ్లాద వరదస్వామి ఆలయ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ ఉంటారు.
అద్భుతమైన కళాసంపద
భారతీయ దేవాలయాలు... అద్భుత నిర్మాణ సంపదకు కేంద్రాలు. ప్రాచీన నిర్మాణ కళాచాతుర్యాన్ని సగర్వంగా చాటుతూ అలరారుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. ప్రాకారాలు, నిర్మాణాలు, గోపురాలు.... ఇలా ప్రతి అడుగులోనూ కళాత్మకత ఉట్టిపడుతూ ఈ క్షేత్రం మైమరిపిస్తుంది.
భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని దశదిశలా చాటుతూ అలరారుతున్న దేవస్థానం అహోబిల క్షేత్రం. సువిశాల ప్రాంగణంలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం కోసం అనేక మంది రాజులు, చక్రవర్తులు పాటుపడ్డట్లు స్థలపురాణం. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు స్వామికి బంగారు విగ్రహాలు తయారుచేయించి మంటపాలు, దేవాలయం నిర్మించినట్లు చెబుతారు.
ఆలయంలో 64 స్తంభాలతో కళ్యాణ మంటపం, 82 స్తంభాలతో మరో మంటపం కనిపిస్తుంది. దీన్నే రంగమంటపం అని అంటారు. ఈ రంగమంటపాన్ని 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించారు. ఈ ఆలయంలో స్తంభాలు, ప్రాకారాలు, గోపురాలపై అలనాటి శాసనాలు, నృసింహ స్వామి అవతార విశేషాలు, నృత్యభంగిమలు, శృంగార శిల్పాలు, వివిధ వైష్ణవ స్వరూపాలు వంటి దర్శనమిస్తాయి.
భారతీయుల నిర్మాణ చాతుర్యాన్ని సగర్వంగా చాటుతూ అత్యద్భుత శిల్పకళా సంపదతో అలరారుతూ ఉంటుంది అహోబిల క్షేత్రం. కళ్లు తిప్పుకోనివ్వని ధ శిల్పాలు, ప్రాకారాలు, గోపురాలతో ఈ ఆలయం విరాజిల్లుతోంది.
శ్రీవేంకటేశ్వరుడు ప్రతిష్టించిన స్వరూపం
పద్మావతీ పరిణయ సమయంలో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన స్వరూపం దిగువ అహోబిల నరసింహ స్వామి. అనేక మంది దేవతలు, రుషులు దర్శించి పావనమైన ప్రదేశమని ఈ అహోబిలానికి పేరు. నరసింహ క్షేత్రాల్లోనే మహిమాన్విత పుణ్యధామంగా ఈ ప్రదేశం అలరారుతూ ఉంది.
దేశంలోని మరే నరసింహ క్షేత్రానికి లేని విశిష్టత అహోబిల క్షేత్రం కల్గి ఉంది. విష్ణుమూర్తి నరసింహుడుగా ఇదే ప్రదేశంలో అవతరించినట్లు స్థలపురాణం. దిగువ అహోబిలంలో ఉన్న మూలరాట్ను...... పద్మావతితో కళ్యాణానికి ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టించినట్లు స్థలపురాణం. ఈ ఆలయ పరిసరాల్లో నరసింహ స్వామి 9 రూపాల్లో కొలువై ఉన్నారు. నరసింహుడు ఇన్ని రూపాల్లో కొలువైన పుణ్యతీర్ధం మరెక్కడా లేదని ప్రతీతి.
అహోబిల క్షేత్రంలో ఉపాలయాలుగా గరుడాళ్వార్ సన్నిధి, మహాలక్ష్మి వంటి దైవాలు కొలువుతీరి ఉన్నారు. వీరితో పాటు కోదండరామ స్వామి వంటి దైవం కూడా దర్శనమిస్తారు. దీనితో పాటు శాలమైన పుష్కరిణి కూడా కనిపిస్తుంది.
ఎలా వెళ్లాలి?
అహోబిలం చేరుకోవడానికి విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలకు 68కిలోమీటర్ల దూరంలోను, ఆళ్లగడ్డకు 24 కిలోమీటర్ల దూరంలోనూ అహోబిలం నెలవై ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి ఇక్కడికి విస్తృత రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నవనారసింహుడు కొలువైన అహోబిల క్షేత్రాన్ని దర్శించి మీరూ పునీతులు కండి.