About Yaganti Temple and History-Mystery - యాగంటి దేవాలయము చరిత్ర

 యాగంటి దేవాలయము చరిత్ర
యాగంటి దేవాలయము:

ఇది కర్నూలు జిల్లా బనగానపల్లికి సమీపంలో వుంది యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయం శ్రీ ఉమామహేశ్వరుని ఆలయం.. 

యాగంటి బసవన్న : సుమరు 90 సంవత్సరాల క్రితం దీని చుట్టు ప్రదిక్షనలు చేసేవారు. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్థావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. 

కాకులకు శాపం: ఇక యాగంటిలో: కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు. . . .
© 2014 TIRUMALA BALAJI INFO - ALL RIGHTS RESERVED
Template By FIANESIA Diberdayakan oleh Blogger